కరోనా: ధోనిపై ట్రోలింగ్‌.. మండిపడ్డ భార్య!

ముంబై: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) సంక్షోభంపై పోరులో ప్రభుత్వాలకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు పలువురు వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ అసోం ప్రభుత్వానికి తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన వంతు సహాయంగా ఓ ఎన్జీవో ద్వారా లక్ష రూపాయలు సహాయ నిధికి అందించినట్లు వార్తలు వెలువడ్డాయి.(834కు చేరిన కేసులు.. 19 మంది మృతి)