సోషల్ మీడియా, ఫేక్ వీడియోల మాయలో పడకండి!

 న్యూ ఢిల్లీ: సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, నకిలీ సమాచారం వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వదంతులకు అడ్డుకట్ట పడడంలేదు. ముఖ్యంగాం  కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో తీవ్ర ఆందోళన పెరుగుతున్న క్రమంలో ఇలాంటి అవాంఛనీయ ధోరణి పెరుగుతుండటం కలవరం పుట్టిస్తోంది. వైరస్ వ్యాప్తిని  నిరోధించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఆంక్షల సమయంలో కూడా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ లో నకిలీ సమాచారంతో పలు వీడియోలు  హల్ చల్ చేస్తున్నాయి ఇలాంటి వీడియోలను నమ్మవద్దని, నకిలీ వార్తల పట్ల జాగ్రత్తగా వుండాలని ఢిల్లీ పోలీసులు  స్పందించారు.  ఢిల్లీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం గత ఐదు రోజులుగా ఓ వర్గానికి చెందిన ప్రజలను లక్ష్యంగా సోషల్ నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఈ ధోరణి బాగా పెరిగింది. దీంతో వైరలవుతున్న 30 వేలకు పైగా వీడియోలను నిపుణులు విశ్లేషించారు. హిందీ, ఉర్దూ భాషల్లో తప్పుడు సమాచారంతో అనేక  పోస్టులను గుర్తించారు.