రణ్‌బీర్‌ అంటే చాలా ఇష్టం: విజయ్‌ దేవరకొండ

అర్జున్‌ రెడ్డి సినిమాతో సూపర్‌హిట్‌ కొట్టిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్‌ హీరో అయిపోయాడు. తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో విజయ్‌ ఒకరు. టాలీవుడ్‌ సెన్సెషన్‌ల స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ హీరో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనేక విషయాలను పంచుకున్నారు.  ఆయన మాట్లాడుతూ.. బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నటుడిగా ఎవరిని స్పూర్తిగా తీసుకుంటారని ప్రశ్నించగా.. రణ్‌బీర్‌ కపూర్‌ అని సమాధానమిచ్చారు. తను ఎక్కువగా ఫాలో అయ్యే వారిలో రణ్‌బీర్‌ ముందు వరుసలో ఉంటాడని, అతన్ని ఎక్కువగా ఇష్టపడతానని చెబ్బుకొచ్చారు. (సాయంలోనూ ప్రత్యేకత చాటుకున్న విజయ్‌ దేవరకొండ)